స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు.. తమిళ్ లో పెద్ద హీరోయిన్. రెండు భాషల్లోనూ అగ్ర హీరోలందరితోనూ నటించింది. 30 ప్లస్ లోనూ ఇంకా కోలీవుడ్ ని ఏల్తోంది. టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ ఛాన్సులందుకుంటోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య`లో ఎంపికైనా…అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను చేజేతులారా వదులుకుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే త్రిష వ్యక్తిగత జీవితంలో కొన్ని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ గురించి తాజాగా మీడియాలో చర్చకు వచ్చింది. ఇక ట్వంటీ ఏజ్ లో త్రిష ప్రేమాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో అప్పుడే హీరోగా పరిచయమై.. కెరీర్ పరంగా ఎదుగుతున్న టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో నిండా ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు పబ్ లు…పార్టీలు..టూర్లు అంటూ లవ్ లైఫ్ ని ఈ జంట బాగానే ఎంజాయ్ చేసారు.
వాటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సహా ప్రతి వివరం బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ఆ లవ్ కి బ్రేక్ పడింది. కారణం ఏదైనా.. ఈ వ్యవహారం గురించి రానా గానీ…త్రిషగాని సరైన ఆన్సర్ ఇవ్వలేదు. ఒకట్రెండు సార్లు ఆంగ్ల మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు త్రిష కేవలం స్నేహితురాలు మాత్రమేనని రానా తెలిపారు. అటుపై త్రిష వ్యాపార వేత్త వరుణ్ మనియన్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడింది. రానా జ్ఞాపకాలనుంచి బయటకు వచ్చిన అమ్మడు బిజినెస్ మేన్ వరుణ్ ప్రేమలో మునిగింది. ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగింది. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆ నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవ్వడం ఆ ఎపిసోడ్ లో పలువురు టాప్ స్టార్ల ఇన్వాల్వ్ మెంట్ ఉందన్న ప్రచారం హీట్ పెంచింది. ఇరు కుటుంబాల మధ్య మాట మాట తేడా రావడంతో నిశ్చితార్ధంతోనే ఆ ప్రేమకు బ్రేక్ పడింది. ఇదంతా గతం.
అలాగని ఈ ముగ్గురు ఒకరికొకకు మాట్లాడుకోవడం మానేసారా? అంటే .. అలాంటిదేమి లేదని తాజా కథనం చెబుతోంది. ఆ ముగ్గురూ ఇప్పటికీ స్నేహితులేనట. ఈ విషయాన్ని రానానే స్వయంగా వెల్లడించారు. స్నేహితులుగా కలిసి ఉన్నామనే ఆయన అంటున్నారు. ఇటీవలే మేం (త్రిష-రానా-వరుణ్) గోవాలో అదిరే పార్టీ చేసుకున్నాం. చాలా సమయాన్ని కలిసి గడిపాం. కాలం ఎంత వేగంగా గడిచిపోతుందని ఓసారి అలా మధుర స్మృతుల్లోకి జారుకున్నాం.. అని రానా తెలిపారు. ప్రేమ.. లవ్ బ్రేకప్ .. నిశ్చితార్థం … వీటన్నిటికీ అతీతమైనది స్నేహం అని చెప్పకనే చెప్పారు రానా. 2014లో రానాకు బ్రేకప్ చెప్పేసిన త్రిష 2015లో వరుణ్ ని పెళ్లాడేందుకు సిద్ధమైంది. కానీ కాలం కలిసి రాలేదు. ప్రస్తుతం రానా.. త్రిష ఎవరికి వారు సింగిల్స్ గానే ఉన్నారు. ఇంత గ్యాప్ తర్వాత కూడా పెళ్లి.. లైఫ్ సెటిల్ మెంట్ మాటెత్తితే వీరి నుంచి అస్సలు సరైన స్పందనే ఉండదు.