కొత్త ట్రైలర్: పందితో  ఫైటింగ్ లు..ఛేజింగ్ లు

                          (సూర్యం)

పందిపిల్లతో రవిబాబు తెరకెక్కిస్తోన్న సినిమా “అదిగో”. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈగతో సినిమా వచ్చింది కానీ  ఇంతవరకు టాలీవుడ్ లో పంది ప్రధాన పాత్రలో    సినిమా రాలేదు. దాంతో ….ఇండస్ట్రీలో కూడా ఆ సినిమా ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న క్యూరియాసిటీ ఏర్పడింది.

అందుకు తగ్గట్లుగానే రవిబాబు కూడా….ఆ ఒక్క సినిమాపైనే ఫోకస్ చేసి అదే పనిలో ఉంటున్నారు. అప్పడప్పుడు పబ్లిసిటికి కొన్ని పోస్టర్స్ పబ్లిక్ గా వదులుతున్నాడు.  ఆ మధ్యన టీజర్ వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిగో ఇప్పుడు అదిగో అంటూ ట్రైలర్ వదిలాడు. పంది ఫైటింగ్ లు కూడా చేస్తోందంటూ పిల్లలు మురిసిపోయేలా ఉంది. మీరు ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి.

నిజానికి ఎప్పుడో `అదిగో` విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ రీజన్స్ వల్ల దాని విడుదలలో జాప్యం జరిగింది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ  చిత్రం…ఎట్టకేలకు అతి త్వర లో విడుదల కాబోతోందని తెలుస్తోంది. సురేష్  ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకం’పై  ఈ సినిమా తెరకెక్కుతోంది.