ఆ నటి సోదరుడు హత్యకు గురయ్యాడు. అది హత్యా ఆత్మహత్యనా? అన్నది ఇప్పటికీ ఆ కుటుంబానికి సందేహమే. మరో తమ్ముడు ఘోర యాక్సిడెంట్ లో దుర్మరణం పాలయ్యాడు. ఇదంతా ఒక కోణం అనుకుంటే.. తన ఇద్దరు కొడుకుల్ని కోల్పోయిన తన తల్లి తనను సాకేందుకు చీరలు అమ్మింది. అనంతరం ఎల్.ఐ.సీ ఏజెంట్ గా చేరి పాలసీలు చేర్పించింది. రియల్ ఎస్టేట్ లో చేరి ఫ్లాట్లు అమ్మేది. ఇప్పటికీ ఎల్.ఐ.సీ పాలసీలు చేర్పిస్తూనే ఉంది. తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది ఆ దురదృష్ట జాతకురాలు. ఇదంతా ఎవరి గురించి అంటే ప్రతిభావని ఐశ్వర్యా రాజేష్ గురించే.
ఈ తెలుగమ్మాయి నటుడు రాజేష్ కుమార్తె. నటి శ్రీలక్ష్మి తనకు మేనత్త అవుతుంది. తన తాతగారికి నటించిన అనుభవం ఉంది. అయితే చిన్నప్పుడే విధి వక్రించి తన తండ్రి రాజేష్ ని కోల్పోవడంతో అమ్మ ఎన్నో కష్టాలు అనుభవించి తమను పెంచి పోషించింది. తనకు సాయం అయ్యేందుకే తాను ఓ చాక్లెట్ బ్రాండ్ ప్రచారం కోసం షాపింగ్ మాల్ లో నించోవాల్సి వచ్చింది. ఆ ఉద్యోగానికి రూ.225 జీతం అందుకుంది. అలాగే ఓ బుల్లితెర రియాలిటీ షోకి యాంకరింగ్ చేసింది. బుల్లితెర యాంకర్ గా కొనసాగింది. అయితే ఎలాగైనా ఎదగాలనే పంతంతో తాను కథానాయిక అయ్యింది. గుండెను చిదిమేసే ఎన్నో చేదు నిజాల్ని మనసులోనే దాచుకుని ఎక్కడా విషాదం గురించి బయటపడక ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది. అయితే ఇలాంటి ఎన్నో కఠోర నిజాల్ని ఇటీవలే తిరుచ్చీ ఐఐఎంలోని టిఇడి టాక్ అనే ఓ చర్చా వేదికపై వెల్లడించి షాకిచ్చింది ఐశ్వర్యా రాజేష్. తాను నటిగా కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో తన రంగు గురించి విమర్శించేవారని.. లైంగిక వేధింపులకు గురి చేశారని కూడా ఐశ్వర్య వెల్లడించి షాక్ మీద షాక్ లు తినిపించింది. అలాగే తన సోదరుడు ఓ యువతితో ప్రేమలో ఉన్నప్పుడు అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? అన్నది ఇప్పటికీ తేలలేదని వెల్లడించి మరో పెద్ద షాకిచ్చారు. ప్రస్తుతం తాను తమిళం సహా తెలుగు.. ఇతర భాషల్లోనూ బిజీ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే.
Very happy to be part of @TEDx @TEDx_IIMTrichy shared My Journey To Success here is d link .. https://t.co/kzO2hT2EQo
— aishwarya rajesh (@aishu_dil) May 23, 2020