‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నాగరాజు ఆశలన్నీ దానిపైనే అంట

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు గుర్తున్నాడా? ఆ సినిమాలో తెలంగాణ యాసలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న ఈ నటుడు తన తర్వాత సినిమాలలో అంతగా అలరించలేకపోయాడు. త్వరలో ఈ యాక్టర్ ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమాలో తన తల్లిగా ఒకప్పటి టాప్ హీరోయిన్ నటించనున్నారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇంకా ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండనుంది అని వివరించాడు.

ఈ సినిమాలో నా పాత్రకి చాలా షేడ్స్ ఉన్నాయి. నాది ఒక యారగెంట్ క్యారెక్టర్. కథ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను యూఎస్ వెళ్ళాక ఎలా సెటిల్ అయ్యాను అనే అంశంపైన బేస్ అయిన స్టోరీ ఇది. అంతేకాదు ఈ సినిమాలో నా తల్లిగా హీరోయిన్ నిరోషా నటించనున్నారు. పన్నెండేళ్ల తరువాత మళ్ళీ ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించనున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. తన కెరీర్లో ఇదొక మంచి సినిమాగా నిలిచిపోతుందని, తనని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.