స్వంత కొడుక్కి మందు అలవాటు చేసే తండ్రులు ఉన్నారా ? అలా మందు ఇచ్చే తండ్రులు చాలా అరుదుగా మాత్రమే వుంటారు . ఎందుకంటే మందు అనేది ఓ వ్యసనం . చూస్తూ , చూస్తూ ఏ తండ్రి ఆలా చేయడు . కానీ నిర్మాత దర్శకుడు వి.బి. రాజేంద్ర ప్రసాద్ తన కుమారుడు జగపతి బాబుకు మందు ఇచ్చేవాడట . ఈ విషయాన్ని జగపతి బాబే స్వయంగా చెప్పాడు . “తన రెండవ సినిమా “అడవిలో అభిమన్యుడు ” చిత్రం షూటింగ్ చేసేటప్పుడు ఉదయం ఒక హాఫ్ బాటిల్ మందు పంపి తాగి రమ్మనేవాడట .
ఆ చిత్రం ఎక్కువ భాగం కొండలు, గుట్టలు , నీళ్ళల్లో జరిగింది . అది మామూలు కష్టం కాదు , నాన్నగారు స్వయంగా చూసి నాభాధ తెలియకుండా ఉండటానికి మందు తాజాగా మానేవారు ” అని చెప్పాడు . తాగి ననటించమని నేను చెప్పను. కానీ అప్పట్లో అలాతాగుడు అలవాటు చేసాడు మానాన్న అన్నాడు .
అలాగే అంతఃపురం సినీ షూటింగ్ విషయంలో కూడా తానూ తాగి నటించినట్టు ఒప్పుకున్నాడు జగపతి బాబు .
నేను తాగటం వాళ్ళ ఎవరికీ నష్టం జరగ లేదు , సెట్లో అసభ్యంగా ప్రవర్తించలేదు అంటూ జగపతి బాబు తన తాగుడు వ్యవహారాన్ని సమర్ధించుకున్నారు .