ఎవరి ఈవిడ గుర్తుపట్టండి మరి !

ఎత్తుపళ్లు, చేతిలో పిజ్జాతో కాస్త విచిత్రంగా ఉన్న ఈమె ఎవరో కాదండీ. ‘హార్ట్‌ ఎటాక్‌’ చిత్రంతో కుర్రకారు మనసులు దోచిన నటి అదా శర్మ. ఈ భామ ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..’ అని ట్వీట్‌ చేశారు. అయితే అక్కడ ఉన్నది ఆమేనని అభిమానులు గుర్తు పట్టేశారు. ‘నువ్వు ఎంత మేకప్‌ వేసినా మేం గుర్తు పట్టగలం, నువ్వే..’ అంటూ కామెంట్లు చేశారు. మరి అదా ఈ లుక్‌లో ఎందుకు తయారయ్యారో చెప్పలేదు.

అదా ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’ అనే హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. మొదటిసారి ‘ది హాలిడే’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఇటీవల విడుదలైంది.