అల్లు అర్జున్ నటిస్తున్న 20వ చిత్రం అప్డేట్పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. సుకుమార్ – బన్నీ కలయికలో వస్తున్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడవ సినిమా. దీంతో సహజంగానే ఈ సినిమా విశేషాలపై బన్నీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. మైత్రీ మూవీమేకర్స్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్‌లుక్ ఎలా వుండబోతోందా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఫ్యాన్‌మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 8న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని రిటీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించింది. అది కూడా కాస్త భిన్నంగానే సినిమా కాన్సెప్ట్‌ని, ఇందులో హీరో వాడే యాసని చోడించి ప్రకటన చేయడం ఆకట్టుకుంటోంది. సినిమాలో రాయలసీమలోని చిత్తూరు యాసలో హీరో అల్లు అర్జున్ డైలాగ్‌లు చెబుతాడు. అందుకే ఫస్ట్‌లుక్‌లో ఆ భాషను వాడారు.
`ఏమబ్బా అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తుండే #AA20 అప్డేట్ ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకి వస్తాండాది. రెడీ కాండబ్బా` అని పోస్టర్లో వెల్లడించారు. నల్లమల అడవుల్లో కుదరకపోతే కేరళ అడవుల్లో అల్లు అర్జున్ పాల్గొనగా కీలక ఘట్టాలని షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేశాడు కానీ కరోనా కారణంగా ఆ ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇదిలా వుంటే ఏప్రిల్ 8..ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం వుంది…(సశేషం)…టు బి కంటిన్యుడ్.. అని చిరు ట్విస్ట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్సే కాదు.. ప్రేక్షకులు కూడా ఈ ట్విస్ట్ ఏంటని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.