ఈ వీడియో చూస్తూంటే సంక్రాంతికి గట్టిపోటీ ఇస్తుందనిపిస్తోంది

ఈ సంక్రాంతి బరిలో వెంకటేష్ తనదైన స్టైల్ కామెడీ ‘ఎఫ్ 2’తో దూసుకువస్తున్న సంగతి తెలిసిందే. అయితే అటు ఎన్టీఆర్ బయోపిక్, ఇటు మాస్ సినిమా వినయ విధేయ రామ మధ్యలో ఈ సినిమా వర్కవుట్ అవుతుందా అని చాలా మంది సందేహపడుతున్నారు. అయితే సంక్రాంతికి ఫెరఫెక్ట్ సీజన్ సినిమా ఇదే అని ఈ రోజు రిలీజైన పాటతో అర్దమవుతోంది.

సంక్రాంతికి(జ‌న‌వ‌రి 12న‌) విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. తాజాగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో ఫ‌న్ అనే లిరిక‌ల్ సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తోంది. వెంకీ, త‌మ‌న్నా కెమిస్ట్రీ బాగుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలతో ఈ సంక్రాంతి విన్నర్ గా ఎఫ్ 2 కూడా గట్టి పోటీ ఇస్తుందనటంలో సందేహం లేదనిపిస్తోంది.

Entho Fun Video Song || F2 Songs || Venkatesh, Varun Tej, Anil Ravipudi || DSP

విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ అనేది ట్యాగ్‌లైన్‌. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఫ‌న్ రైడర్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు.