బిగ్ అప్డేట్ : బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ అదిరే అప్డేట్ రాబోతుంది..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర బిగ్గెస్ట్ మాస్ హీరోస్ పేర్లలో డెఫినెట్ గా ఉండే పేరు నందమూరి బాలకృష్ణ. తనదైన సినిమాలతో టాలీవుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న బాలయ్య మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక భారీ హిట్ ని తన లెవెల్ కి తగ్గ హిట్ ని “అఖండ” తో  దీనితో ఈ సినిమాల తర్వాత బాలయ్య ఓకే చేసిన సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి భారీ హైప్ ని తెచ్చుకున్నాయి.

ఇప్పుడు అయితే తన కెరీర్ లో 107వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కూడా బాలయ్య తో యాక్షన్ ప్రాజెక్ట్ నే ప్లాన్ చేసాడు. దీనితో ఈ సినిమాపై కూడా మంచి హైప్ సెట్టయ్యింది. అయితే ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ సినిమాపై అయితే ఈరోజు సాయంత్రం నాలుగున్నర సమయానికి ఓ బిగ్ అనౌన్స్ మెంట్ అందిస్తున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. దీనితో అయితే బాలయ్య ఫ్యాన్స్ ని చిత్ర యూనిట్ లు సిద్ధం అవ్వమంటున్నాయి. మరి ఈ అప్డేట్ ఏంటో అని ఇతర సినీ వర్గాలతో పాటు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.