500 మందితో భారీ యాక్ష‌న్ !

వెంక‌టేష్ అత‌ని మేన‌ల్లుడు నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం వెంకీమామ‌. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ని ఉగాది పండుగ సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ శివార్ల‌లో జ‌రుగుతుంది. మేళాలో 500మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు ఫైట‌ర్స్‌తో భారీ యాక్ష‌న్ సీన్‌ని ప్లాన్ చేశార‌ట‌. రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో రూపొంద‌నున్న ఈ ఫైట్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌తో చిత్ర మేజ‌ర్ పార్ట్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. .