50 కోట్ల వివాదం..చిరు రియాక్షన్ , అంతా మూసుకోవాల్సిందే

50 కోట్ల డిమాండ్ పై చివరకు స్పందించిన చిరు

తమ వంశ మూల పురుషుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’నిర్మాతలు తమకు న్యాయం చేయాలని ఆయన వంసస్ధులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం తమకు రూ.50 కోట్లు చెల్లించాలని చిత్ర నిర్మాత రామ్ చరణ్‌ను అడుగుతున్నారు. అందుకోసం వాళ్లు కోర్టుకు కూడా ఎక్కారు. అయితే సైరా నరసింహారెడ్డి సినిమా బయోపిక్ కాదని, కల్పిత కథ అని చెప్పడం ద్వారా ఈ కేసును కొట్టివేసేలా చేయగలిగాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. దీంతో వివాదం సద్దుమణిగింది.

ఈ వివాద సమయంలో రామ్ చరణ్ అయినా ఈ విషయం గురించి మాట్లాడాడు కానీ చిరంజీవి మాత్రం స్పందించలేదు. దాంతో ఆయన వెర్షన్ వినాలని చాలా మందికి కుతూహలంగా ఉంది. ఈ విషయమై మీడియావారు ప్రశ్నించగా…ఓ ఇంటర్వ్యూలో చిరు ఈ విషయమై ఓపెన్‌గానే మాట్లాడాడు. తన వెర్షన్ ఏమిటో చెప్పారు.

చిరంజీవి మాట్లాడుతూ…ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులని.. వారిని ఎవరో తమ మీదికి ఉసిగొల్పి పంపారని చిరు ఆరోపించడం గమనార్హం. నిజానికి వాళ్ల ఆర్థిక పరిస్థితి సామాన్యమే అని.. కానీ తమకు రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించాడు చిరు. ముందు తాము వారికి, వాళ్ల ఊరికి సాయం చేయాలనే అనుకున్నామని.. ఆ విషయం చూడమని ఎన్వీ ప్రసాద్‌కు చెప్పామని.. కానీ వాళ్లంతా వచ్చి తాము పాతిక కుటుంబాలున్నాం. మాకు కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం మాత్రం అన్యాయంగా అనిపించిందని చిరు చెప్పాడు.

అలాగే …వందేళ్లు అయిన తర్వాత ఎవరి కథ అయినా చరిత్రే అని కోర్టు చెప్పిందని.. స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్‌ పాండే మీద తీసిన సినిమా విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఒక కథ చరిత్రగా మారడానికి అరవై ఏళ్లయితే చాలని చెప్పిందని… దాని మీద వారసులకు హక్కు ఉండదని అన్నాడుు చిరు.

ఇప్పుడు పాతిక కుటుంబాలకు సాయం చేస్తే.. తర్వాత ఇంకొందరు తామూ వారసులమేనని రారని గ్యారెంటీ ఏమిటని ఎన్వీ ప్రసాద్‌ ప్రశ్నించినట్లు చిరు వెల్లడించాడు. తాము చరిత్రను వక్రీకరిస్తే తప్పుబట్టాలని.. అంతే తప్ప డబ్బులు అడగకూడదని.. అడిగినా ఇవ్వాల్సిన అవసరం చట్టపరంగా లేదని.. రేపు ‘సైరా’ సినిమాకు లాభాలు వస్తే, ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలని భావిస్తున్నామని చిరు స్పష్టం చేశాడు.