Gallery

Home Tollywood 30 రోజుల్లో ప్ర‌దీప్ ప్రేమాయ‌ణం!

30 రోజుల్లో ప్ర‌దీప్ ప్రేమాయ‌ణం!

ప్ర‌దీప్ స్వ‌యం వ‌రం అంటూ నానా హంగామా చేసిన బుల్లితెర యాంక‌ర్ తాజాగా `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` అనే పేరుతో ఓ సినిమా చేస్తూ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. యాంక‌ర్‌లు హీరోలుగా క్లిక్ అయినా సంద‌ర్భాలు చాలా అరుదు. ఇప్ప‌టికి అలా ట్రై చేసిన ఝాన్సీ, యాంక‌ర్ ర‌వి, సుమ‌, సుడిగాలి సుధీర్ స‌క్సెస్ కాలేక‌పోయారు. యాంక‌ర్‌లుగానే మిగిలిపోయారు. ఆ సెంటిమెంట్‌ని ప్ర‌దీప్ మాచిరాజు అయినా బ్రేక్ చేస్తాడా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

బుల్లితెర‌పై త‌న‌దైన మార్కు షోల‌తో ఆక‌ట్టుకుంటున్న ప్ర‌దీప్ గ‌త కొంత కాలంగా యాంక‌ర్‌గా, ప‌లు షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆర్టిస్ట్‌గా సినిమాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే వున్నాడు. గుణ‌శేఖ‌ర్ `వ‌రుడు`, సుకుమార్ `100% ల‌వ్‌`, త్రివిక్ర‌మ్ `అత్తారింటికి దారేది`, హ‌రీష్‌శంక‌ర్ `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`, కార్తిక్ వ‌ర్మ `భ‌మ్ భోలేనాథ్‌` వంటి చిత్రాల్లో చిన్న పాత్ర‌లంలో మెరిసాడు ప్ర‌దీప్‌. తొలిసారి `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`సినిమాతో హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు.

ఎస్వీబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా ద‌ర్శ‌కుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నీ ఈ చిత్రం ద్వారా యాంక‌ర్స్ కూడా హీరోగా స‌క్సెస్ కాగ‌ల‌ర‌ని ప్ర‌దీప్ నిరూపిస్తాడా? అలా నిరూపించుకుని మాధ‌వ‌న్ త‌రహాలో సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడో చూడాలి.

- Advertisement -

Related Posts

థియేటర్లలోకి సినిమాలొస్తున్నాయ్.. ప్రేక్షకులొస్తారా.?

ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి సినిమాలు వచ్చేస్తున్నాయ్. సినిమాలొస్తే సరిపోదు, ప్రేక్షకులు రావాలి. వస్తారు, నో డౌట్.. అంటోంది తెలుగు సినీ పరిశ్రమ. చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు తెలుగు సినీ ప్రముఖులు, కరోనా సెకెండ్...

‘ఇష్క్’లో థ్రిల్ ఫీలయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి: తేజ

జాంబీ రెడ్డి మూవీతో కథానాయకుడిగా హిట్ కొట్టిన 'తేజ సజ్జ' ఫుల్ జోష్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన 'ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా...

ప్రభాస్ సినిమా మొదలు.. మొదట అమితాబ్ మీదనే

ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఉండేలా రూపొందిస్తున్నారు. 'రాధేశ్యామ్' మొదలుకుని 'సలార్, ఆదిపురుష్' లాంటి ప్రతి చిత్రమూ పాన్ ఇండియా చిత్రమే, అయితే ఒక సినిమా...

Latest News