హీరో కోసం పాట రాస్తున్నాడు!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీని భారిన ప‌డిన ఇట‌లీ విల విల లాడుతోంది. దీని దెబ్బ‌కు అన్నీ లాకౌట్ అయిపోతున్నాయి. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాలు రాష్ట్రాల‌న్నీ ఇప్ప‌టికే లాకౌట్ ప్ర‌క‌టించేశాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31 వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూని విధించారు. దీంతో షాపింగ్ మాల్స్‌తో పాటు థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. సినిమాల రిలీజ్‌లు, షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్స్ అంతా ఎవ‌రికి న‌చ్చిన ప‌ని వారు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఓ ద‌ర్శ‌కుడు మాత్రం ఈ స‌మ‌యాన్ని కూడా వాడేసుకుంటున్నాడు.

త‌ను చేస్తున్న సినిమా కోసం గేయ ర‌చ‌యిత‌గా మారిపోయాడు. ఓ పాట రాసేస్తున్నాని చెబుతున్నాడు. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు శివ నిర్వాణ‌. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ప్ర‌స్తుతం `ట‌క్ జ‌గ‌దీష్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్‌ల‌న్నీ స్థంభించిపోవడంతో ఇంటికే ప‌రిమ‌త‌మైపోయిన శివ నిర్వాణ ఈ సినిమా కోసం ఓ అద్భుత‌మైన సిట్యువేష‌న‌ల్ సాంగ్‌ని రాస్తున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా త‌రువాత విజ‌య్ దేవ‌రకొండ హీరోగా శివ నిర్వాణ ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.