హీరోయిన్ ట్వీట్‌కి ర‌చ్చ చేసిన ఫ్యాన్స్‌!

హీరోయిన్ ట్వీట్‌కి ర‌చ్చ చేసిన ఫ్యాన్స్‌!

త‌మిళ హీరో విజ‌య్ అభిమానులు హీరోయిన్ మాళ‌వికా మోహ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వివాదం కావ‌డంతో విజ‌య్ ఫ్యాన్స్ ఆగ్ర‌మాన్ని వ్య‌క్తం చేయ‌డం వైర‌ల్‌గా మారింది. విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం `మాస్ట‌ర్‌‌`. ఖైదీ ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాల్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల‌లోనే రిలీజ్ చేయాల‌నుకున్నారు.

అయితే తాజా ప‌రిస్థితులు నేప‌థ్యంలో ఈ సినిమా రిలీజ్‌ని చిత్ర బృందం వాయిదా వేసింది. ఓటీటీ సంస్థ‌లు భారీ ఆఫ‌ర్లు ఇస్తున్నా నిర్మాత‌లు మాత్రం థియేట‌ర్లో మాత్ర‌మే రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో చిత్ర బృందం ఒకే ఇంట్లో వుంటే ఎవ‌రెవ‌రు ఏఏ ప‌నుల్లో నిమ‌గ్న‌మౌతారో అనే థాట్‌తో విజ‌య్ ఫ్యాన్స్ ఓ కార్టూన్ వీడియోని రూపొందించి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. యూనిట్‌లో వున్న ఒక్కొక్క‌రు ఒక్కో ప‌నిలో క‌నిపించారు. హీరోయిన్ మాళ‌విక మోహ‌న‌న్ మాత్రం కిచ‌న్‌లో వంట చేస్తున్న‌ట్టుగా క‌నిపించింది.

దీంతో హ‌ర్ట్ అయిన మాళ‌విక `ఊహా చిత్రాల్లోనూ మేం వంట ప‌నుల‌కే ప‌రిమిత‌మా? అని ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కి ఆగ్ర‌హించిన ఫ్యాన్స్ బూతుల‌తో మాళ‌విక‌ని ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.విష‌యం హ‌ద్దులు దాటుతుండ‌టంతో మాళ‌విక ట్వీట్‌ని డెలీట్ చేసింది. అయినా ట్రోలింగ్ ఆగ‌క‌పోవ‌డంతో గాయ‌ని చిన్మ‌యి ఆమెకు అండ‌గా నిలిచింది. ఒక న‌టి, మ‌హిళ త‌న బాధ‌ని వ్య‌క్తం చేస్తే ఈ స్థాయిలో దాడికి దిగుతారా? అని మండిప‌డింది.