హీరోగా వివి వినాయిక్, ఫస్ట్ లుక్ వచ్చేసింది

‘సీనయ్య’ చిత్రం ఫస్ట్ లుక్

మాస్ డైరక్టర్ వివి వినాయక్‌ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన బాగా సన్నబడ్డారు కూడా. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని వదిలారు. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. అందులో వినాయక్‌ మెకానిక్‌ షెడ్‌లో నుంచి నడిచివస్తున్నట్టు కనిపిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర కథ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం వినాయక్‌ బరువు తగ్గారు.

తంలో ఠాగూర్‌లో చిన్న పాత్రలో కనిపించిన వినాయక్‌ పూర్తి స్థాయి నటుడిగా ఇంతవరకు కనిపించలేదు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాని వినాయక్‌ పుట్టినరోజు అయిన అక్టోబర్‌ 9న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టానున్నారు. ఆ రోజు నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. 10 వతేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో చేయబోతున్న పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్నారు. జిమ్ లో కష్టపడుతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి శ్రియ నటిస్తుందని సమాచారం . దీనిని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది . గతంలో వినాయక్ దర్శకత్వంలో శ్రియ చెన్నకేశవరెడ్డి ,ఠాగూర్ సినిమాల్లో నటించింది.

2018లో వచ్చిన ఇంటిలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో దర్శకుడిగా ఫామ్‌ కోల్పోయిన వినాయక్‌కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వస్తుందో అని ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది.