ప్రభాస్ `సాహో` కథేంటి, ఆడుతుందా
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ చిత్రం సాహో. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన యాక్షన్ సీన్స్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కేవలం ఒక సినిమా అనుభవంతో సుజీత్, సాహో లాంటి మెగా ప్రాజెక్ట్‌ను ఎలా డీల్ చేశాడనే ఆసక్తి అందరిలో ఉంది.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే..
ముంబైలో రెండు వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది. అయితే ఆ దొంగతనం చాలా తెలివిగా ప్లాన్ చేసి చేయటంతో …చిన్న క్లూ కూడా దొరకక, ఎవరి చేశారో తెలుసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. దాంతో ఈ దోపిడి వెనుకున్న వారిని పట్టుకోవడానికి అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్)ను అపాయింట్ చేస్తుంది డిపార్ట్‌మెంట్. అశోక్ కి సాయంగా క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతానాయర్ (శ్రద్ధా కపూర్) రంగంలోకి దిగుతుంది. అక్కడ నుంచి అశోక్ తన తెలివిని ఉపయోగించి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి దొంగ (నీల్ నితిన్ ముఖేశ్)ని ట్రేస్ చేస్తాడు.
కానీ, అతను రెడ్ హ్యాండెడ్ గా అశోక్‌కి దొరకడు. ఇదిలా ఉంటే వాజీ సిటీలో ఒక మిస్టీరియస్ బ్లాక్ బాక్స్ ఉంటుంది. దాని కోసం ఎక్కడెక్కడ గ్యాంగ్‌స్టర్స్ ట్రై చేస్తూంటారు. ఆ దొంగ కన్ను కూడా ఈ బ్లాక్ బాక్స్ పై పడుతుంది. ఇంతకీ ఆ బ్లాక్ బాక్స్ మిస్టరీ ఏమిటి? ఇంతకీ అశోక్ ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడా.. అమృతానాయర్ పాత్ర ఈ కథ లో ఏమిటి ? అనేది ట్విస్ట్ లతో కూడిన కథ.
టాక్ ఏంటంటే..
అయితే బాహుబలి స్దాయి అంచనాలను సాహో అందుకుందా..? అంటే లేదనే చెప్పాలి. అలాగే బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకునే అవకాసం ఈ సినిమా ఇవ్వలేకపోయింది. అందుకు కారణం ఈ సినిమాలో అతిగా పెట్టిన ట్విస్ట్ లు అంటున్నారు. ఎక్కడా సినిమాలో ఎమోషన్ అనేది రిజిస్టర్ కాకుండా చేసిన క్యారక్టరైజేషన్ సినిమాని దెబ్బ కొట్టిందని తేలుస్తున్నారు. సినిమా ఈ వీకెండ్ కలెక్షన్స్ రాబటచ్చేమో కానీ ఆ తర్వాత అదే హవా కంటిన్యూ అవటం కష్టమే అని అంటున్నారు.