హిందీ రీమేక్ లో చైతు, నిర్మాత దిల్ రాజు?

హిట్ సినిమాలను పట్టుకోవడంలో నిర్మాత దిల్ రాజు పద్ధతే వేరు. తెలుగులో అయితే మంచి కధలను ఎంపిక చేసుకుని సినిమాలు తీస్తారు. అదే రీమేక్ అయితే ఏ భాష అయినా సరే వాటిలో కూడా మంచివి ఇక్కడి ప్రేక్షకుల నాది తెలుసుకుని నిర్మిస్తారు దిల్ రాజు.

అలా ఇప్పుడు తాజాగా ఈయన హిందీలో హిట్ అయిన ‘బధాయి హొ’ అనే సినిమా రీమేక్ రైట్లు సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించడానికి అక్కినేని హీరో నాగ చైతన్య ఆసక్తి చూపిస్తున్నారు. మరింకేం ఇక దర్శకుడు ఒక్కడే ఖరారు కావాల్సి ఉంది. 

మంచి బృందాన్ని ఎంచుకుని స్క్రిప్ట్ కి తగ్గ మార్పులు చేసుకుంటే ముందుకు వెళ్లిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీ మామ’ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల సినిమా కూడా చేస్తున్నాడు. చూస్తుంటే ‘మజిలీ’ విజయాన్ని కొనసాగించేలా ఉన్నాడు చైతు