బన్ని నటించిన అల వైకుంఠపురములో దాదాపు 85 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయగా నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని దాదాపు 120కోట్ల మేర బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అలాగే మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం 100 కోట్ల మేర వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందని సమాచారం. నాన్ థియేట్రికల్ రూపంలో మరో 54 కోట్ల మేర బిజినెస్ సాగించారని తెలుస్తోంది.
సరిలేరు నీకెవ్వరు థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం-25కోట్లు.. సీడెడ్-12కోట్లు.. కృష్ణ-6.30కోట్లు.. గుంటూరు -7.50కోట్లు.. నెల్లూరు -3.20కోట్లు..ప.గో జిల్లా-5.50కోట్లు.. తూ.గో జిల్లా-7.50కోట్లు.. ఉత్తరాంధ్ర 9.60కోట్ల మేర బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఏపీ – తెలంగాణ కలుపుకుని 76.60 కోట్ల బిజినెస్ సాగింది. కర్నాటక -8.30కోట్లు.. రెస్టాఫ్ ఇండియా -1.80కోట్లు… ఓవర్సీస్ -13.60కోట్లు కలుపుకుని ఓవరాల్ గా 100.60కోట్ల మేర బిజినెస్ చేసింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ మరో 54కోట్ల బిజినెస్ చేసింది. ఇక థియేట్రికల్ బిజినెస్ చేసిన 100 కోట్ల మేరకు షేర్ వసూలు చేయాలంటే 200 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా. అలాగే అమెరికాలో 2 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ఓ అంచనా. మహేష్ సరసన ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు-అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.