స‌రిలేరుకి 50 రోజుల వేడుకా?

సినిమాలు 50 రోజులు..100 రోజులు ఆడే రోజులు ఎప్పుడో క‌నుమ‌ర‌గ‌య్యాయి. ఇప్పుడ‌న్ని బాక్సాఫీస్ లెక్క‌లు మాత్ర‌మే సినిమా జ‌య‌ప‌జ‌యాల‌ను నిర్ధేశిస్తున్నాయి. వారం రోజుల్లో ఏ సినిమా ఎంత వ‌సూళ్లు చేసింది? మొద‌టి రోజు వ‌సూళ్లు ఎంత‌? వారాంతానికి ఎంత సాధించింది? అన్న‌ద లెక్క‌. ఆ లెక్క అంచ‌నాల‌ను అందుకుటే హిట్టు..లేక‌పోతే ప‌ట్టు అని నిర్ధారించుకో వాల్సిందే. వారం రోజుల్లో సినిమా సంగ‌తేంటో తేలిపోయింది. 50 రోజ‌ల వేడుక‌లు…100 రోజుల వేడుక‌లు ఇప్పుడు లేవు.

అయితే తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌రోసారి పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకునే ఓ ప్ర‌య్న‌తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజ్ అయిన సినిమా చ‌క్క‌ని వసూళ్ల‌ను సాధించింది. దీంతో సినిమాకు బూస్టింగ్ ఇచ్చే ఓ ప్ర‌య‌త్నం చేసారు. 100 కోట్లు..200 కోట్లు బ్లాక్ బాస్ట‌ర్ కా బాప్ అంటూ పోస్ట‌ర్లు వేసి హ‌డావుడి చేసారు. అల వైకుంఠ‌పుర‌ములోకి పోటీగా వాటిని ప్ర‌చారం చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది.

అంతిమంగా ఆ సినిమా ఫ‌లితం విష‌యం ప‌క్క‌న‌బెడితే త్వ‌ర‌లో యూనిట్ స‌రిలేరు కు సంబంధించి గ్రాండ్ గా 50 రోజ‌లు వేడుక నిర్వ‌హిచాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి గ్రాండ్ గా ఈవెంట్ సెల‌బ్రేట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారుట‌. ఇంకా వేదిక‌, తేది డిసైడ్ అవ్వ‌లేదు గానీ సోష‌ల్ మీడియాలో మాత్రం అప్పుడే ప్ర‌చారం ఊపందుకుంది. స‌రిలేరు జ‌న‌వ‌రి 11న రిలీజ్ అయింది. అంటే సినిమా 50 రోజులు పూర్తి అవ్వ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంది. అయితే ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లైతే జ‌రిగిపోతున్న‌ట్లు తెలుస్తోంది.