ప్రాంతాల వారిగా `సైరా` ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్
చరిత్ర మరచిపోయిన వీరుడి కథను చిరంజీవి సైరా నరసింహారెడ్డి
గా వెండితెరపై భారీ ఎత్తున ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తైంది. బాహుబలి, సాహో లాంటి సినిమాల హక్కులను కూడా ‘సైరా’ బ్రేక్ చేసిందని వినపడుతోంది. ‘సైరా’ ప్రీరిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీ రికార్డుగా చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` విషయంలో భారీ పోటీ నెలకొంది. దీంతో నిర్మాతలు ఫ్యాన్సీ రేటు రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను అమ్మారని ట్రేడ్ వర్గాల సమాచారం. బాహుబలి మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రం `సైరా నరసింహారెడ్డి` అని సమాచారం.
ఏరియా బిజినెస్ (కోట్లలో ) డిస్ట్రిబ్యూటర్
——————– —————————————- ———————-
నైజాం 30.00 దిల్ రాజు
సీడెడ్ 22.00 ఎన్ వి ప్రసాద్
నెల్లూరు 5.20 హరి పిక్చర్స్
కృష్ణా 9.00 G3 ఫిల్మ్స్
గుంటూరు 11.50 యువి క్రియేషన్స్
వైజాగ్ 14.40 క్రాంతి ఫిల్మ్స్
ఈస్ట్ గోదావరి 10.40 విజయ లక్ష్మి ఫిల్మ్స్
వెస్ట్ గోదావరి 9.20 ఉషా పిక్చర్స్
మొత్తం ఆంధ్రా & తెలంగాణా 111.70
అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సుదీప్.. లాంటి ముఖ్యమైన నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి…. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.