‘సైరా’ ట్రైలర్‌ లో అదొక్కటే ఇబ్బందిగా ఉంది!

‘సైరా’ ట్రైలర్‌ లో అన్ని బాగున్నాయి ..కానీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ చారిత్రిక చిత్రం `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.

ట్రైలర్‌లోనే యాక్షన్‌, సెంటిమెంట్‌, దేశ భక్తి చూపించారు. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అంటూ మొదలైన ట్రైలర్‌.. చివరి వరకూ అందరినీ కట్టిపడేసింది. అంతేకాకుండా చాలా డైలాగ్‌లు తెగ ఆకట్టుకుంటున్నాయి. అలాగే విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరాయి. అయితే సినిమా లవర్స్ నుంచి ఒకే ఒక విమర్శ వస్తోంది. అదేమిటంటే… చిరంజీవి గెట్ అప్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది అని. కొన్ని షాట్స్ లో వేసిన గెటప్ లు బాగా ఆడ్ గా కనిపించారంటున్నారు. నరసింహా రెడ్డి ..పాత్ర..ఓ దేశభక్తుడు కాబట్టి అందుకు తగినట్లుగా అదీ ఆ కాలం నాటి డ్రస్ లు అనిపించేలా డిజైన్ చేస్తే బాగుండేది అంటున్నారు. అయితే నిజానికి అది పెద్ద సమస్య కూడా కాదు. తరచి తరిచి చూస్తే తప్ప అలాంటి అనుమానం , ఆలోచన రాదు.

ఓవర్ అల్ గా సినిమా ట్రైలర్ మంచి హిట్టే. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలిరా శిస్తు’, ‘స్వేచ్చ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’అంటూ చిరంజీవి పలికే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి.