‘సైరా’యుఎస్ ఎ లో నష్టమా,లాభమా?

‘సైరా’అమెరికాలో బ్రేక్ ఈవెన్ వస్తుందా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది.

మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం..మెల్లిగా వాటిని తట్టుకొని నిలబడి, కలెక్షన్స్ స్టడీ అయ్యింది. ఇప్పటిదాకా $2.27 మిలియన్స్ మాత్రమే సాధించింది. అయితే అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే 3.5 మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అవ్వాలి.

అయితే కలెక్షన్స్ డ్రాప్ అయిన పరిస్దితుల్లో ఆ మార్క్ ని చేరటం కష్టమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. దాంతో నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. అదే సమంయలో ఈ కలెక్షన్లతో ఓవర్సీస్‌లో రెండు మిలియన్లపైగా వసూళ్లు సాధించిన చిత్రాల క్లబ్బులో ‘సైరా నరసింహారెడ్డి’ చేరింది.

‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చిన క్రేజ్ ఓ రేంజిలో చేసినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం డీలా పడటం డిస్ట్రిబ్యూటర్స్ ని కంగారుపెడుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఆ ఇండస్ట్రీల్లో గట్టి పోటీనే ఎదురైంది. అక్టోబర్ 2న హిందీలో ‘వార్’ విడుదల కాగా.. హాలీవుడ్‌లో ‘జోకర్’ రిలీజయ్యింది. తమిళంలో ‘అసురన్’ విడుదలైంది. ఇలా వరస పెట్టి అనేక పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేయడంతో ‘సైరా’ కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.