‘సైరా’పైరసీ …ఆటో డ్రైవర్ పై మెగాభిమానుల దాడి

‘సైరా’మొబైల్‌లో తీస్తున్న వ్యక్తిపై మెగా ఫ్యాన్స్ దాడి

సినిమాలకు పెద్ద శత్రువులగా తయారైంది పైరసీ. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ రోజు సాయింత్రానికి నెట్ లో ప్రత్యక్ష్యమవుతూండటంతో నిర్మాతలు తల పట్టుకుంటున్నారు. ఫైరసీ గట్టిగానే కలక్షన్స్ పై దెబ్బ కొడుతోంది. ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ సైతం చేతులు ఎత్తేసింది. అయితే స్టార్స్ కు ఉన్న అభిమానులు ఈ విషయంలో ఎలర్ట్ గా ఉంటున్నారు. ఎక్కడైనా పైరసీ వాతావరణం కనపిస్తే వెంటనే ఎటాక్ చేసి, పోలీస్ లు పట్టిస్తున్నారు.

తాజాగా చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా మొన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తున్న ఆటో డ్రైవర్ ప్రసాద్ ఓ సన్నివేశాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా గమనించిన చిరంజీవి అభిమానులు అతడిని పట్టుకుని దాడి చేశారు. సినిమాను పైరసీ చేస్తున్నాడని భావించి ఐమాక్స్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులకు అతడిని అప్పగించారు.

<

p style=”text-align: justify”>ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. సినిమా మొత్తం కాకుండా ఒక్క సన్నివేశాన్ని మాత్రమే అతడు చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. అతడు పైరసీ చేసేందుకు చిత్రీకరించలేదని నిర్ధారించిన పోలీసులు అతడిని హెచ్చరించి పంపించివేశారు.