సూర్య ఫ‌స్ట్ సింగిల్ ఆకాశంలో… !

గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సూర్య తాజా చిత్రం `సూర‌రాయి పోట్రు` చిత్రంపై గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నట్టు క‌నిపిస్తోంది. తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో విడుద‌ల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్ప‌టికే టేబుల్ ప్రాఫిట్ జోన్‌ని కూడా దాటిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ప్ర‌మోష‌న్స్‌ని రెచ్చించిన ఉత్సాహంతో యునీక్‌గా ప్లాన్ చేస్తున్నారు. `గురు`. సాలా ఖ‌డూస్‌` చిత్రాల ఫేమ్ సుధా కొంగ‌ర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గునీత్ మోంగాతో క‌లిసి సూర్య నిర్మిస్తున్నాడు.

ఆడియో రిలీజ్‌ని వినూత్నంగా చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఏయిర్ పోర్ట్‌లో ప్లాన్ చేసిన మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ని కూడా యూనిక్ వేలో లాంచ్ చేయ‌బోతున్నారు. జీ.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని `వెయ్యేన్ సిల్లీ…` అనే పాట‌ని ఈ నెల 13న స్పైస్ జెట్ బోయింగ్ 737 ఫ్లైట్‌లో… ఫ్లైట్ ఆకాశంలో వుండ‌గానే రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇలా ఓ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేయ‌డం భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఈ ఫీట్‌ని సాధించిన తొలి చిత్రంగా `సూర‌రాయి పోట్రు` చ‌రిత్ర సృష్టించ‌బోతోంది.