సినీ పరిశ్రమకు .. తెలంగాణ ప్రభుత్వ తాయిలాలు

తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పలు ప్రోత్సహకాలు అందించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడప్పుడు సినీ ప్రముఖులతో చర్చలు జరుపుతుండడం తెలిసిందే. తాజగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తలసాని నాగార్జున ముగ్గురు కలిసి సీరియస్ మీటింగ్ పెట్టారు. ప్రస్తుతం ఈ ముగ్గురి మీటింగ్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తావు తీస్తుంది. అసలు ఎందుకు తలసాని వీరిద్దరితో మీటింగ్ పెట్టాడు అన్న ఆసక్తి తో పాటు సినిమా రంగానికి కేసీఆర్ ప్రభుత్వం పలు వారలు ప్రకటించిందని న్యూస్ మాత్రం హల్చల్ అవుతుంది.

కేసీఆర్ ప్రభుత్వం సీనిమా రంగానికి వరాల జల్లు ప్రకటించారట. శంషాబాద్ లో పూణే తరహాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ నెలకొల్పేందుకు రెడీ అయ్యారట. 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన వారికి అక్కడ ట్రైనింగ్ ఇస్తారట. దాంతో పాటు ఫిలిం నగర్ లో 2 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయిస్తుందట, అందులో కల్చరల్ కేంద్రం ఏర్పాటు చేస్తారట. దాంతో పాటు చిత్రపురి కాలనీ లో హాస్పిటల్, పాఠశాల నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందట. దాంతో పాటు చిత్రపురి కాలనీని మరింతగా పెంచేందుకు మరో పదెకరాల కేటాయిస్తుందట. అలాగే ఎఫ్ డి సి తరపున టివి, సినిమా కళాకారులకు గుర్తింపు కార్డులను అందిస్తారట. మొత్తానికి ఈ 2020లో తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి వరాల జల్లులు ప్రకటించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారట. సో త్వరలోనే వీటిని ప్రభుత్వం ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.