శ్రీ రెడ్డి వివాదంపై సురేష్ బాబు రియాక్షన్

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్ కౌచ్ వివాదం. శ్రీ లీక్స్ పేరిట ఆమె లీక్ చేసిన ఫొటోస్, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. సుమారు నెల రోజుల పాటు సోషల్ మీడియా అంతా ఇదే టాపిక్ స్వైర విహారం చేసింది. ఎవరి నోట విన్నా శ్రీరెడ్డి పేరే. అంతలా వివాదం చెలరేగి చివరికి పవన్ కళ్యాణ్ వైపు తిరిగి ఆ టాపిక్ కి కామా పడింది అనుకోవాలి. ఎందుకంటే దీనికి సొల్యూషన్ దొరకలేదు అంటూ ఇంకా కొంతమంది సెలెబ్రిటీల గురించి అప్పుడప్పుడూ శ్రీ రెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూనే ఉంది. అటు పవన్ కళ్యాణ్ ని, పవన్ అభిమానులని, మెగా ఫ్యామిలీని కూడా సమయం వచ్చినప్పుడల్లా వదలట్లేదు శ్రీరెడ్డి. ఫేస్బుక్ వేదికగా వారిపై తన శైలిలో పోస్టులు పెడుతోంది. బిగ్ బాస్ 2 స్టార్ట్ అయ్యాక నానిపై ఫైర్ అయ్యింది. దీనికి కౌంటర్ గా నాని కూడా ఒక పోస్టు పెట్టి ఆమెకు లీగల్ నోటీసులు పంపుతున్నట్టు చెప్పాడు. తాజాగా బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ గురించి కూడా పోస్టు పెట్టింది. ఇవిలా కొనసాగుతుంటే తాజాగా నిర్మాత సురేష్ బాబు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.

శ్రీరెడ్డి లీక్స్ లో బాగా మారుమ్రోగిన పేరు దగ్గుబాటి అభిరాం. మొదట్లో అభిరాం తనతో చనువుగా ఉన్న ఫొటోస్ బ్లర్ చేసి పోస్ట్ చేసింది. అతను ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ కొడుకు, తన అన్న టాప్ హీరో అతను ఎవరో కనుక్కోండి అంటూ పజిల్ విసిరింది. తర్వాత ఒక ఛానల్ లో ఫొటోస్ రివీల్ చేసి అందరికి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. కానీ వీటిని దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎవరూ ఖండించలేదు. మీడియా ప్రశ్నిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ టాపిక్ డైవర్ట్ చేసేవారు. రీసెంట్ గా సురేష్ బాబు మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించటంతో ఎవరిని అదుపు చేయలేక పోతున్నామన్నారు. అమెరికా తరహాలో ఇండస్ట్రీకి, మీడియాకి మధ్య సమన్వయము లేదని ఇదంతా సెట్ అవటానికి టైం పడుతుందని చెప్పారు.

అయితే ఇలాంటి విషయాలు టాలీవుడ్ ని ఏమి చేయలేవని, ఇండస్ట్రీ ఎప్పుడూ తన పని చేసుకుంటూ పోతుందని తేల్చి చెప్పారు. ఇవన్నీ ఓకే కానీ ఇంత కహానీ వినిపించి అసలు ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. శ్రీరెడ్డికి, తన కొడుకుకి ఉన్న రిలేషన్ గురించి నోరు విప్పకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఉండాలిలెండి ఆ మాత్రం తెలివితేటలు లేదంటే ఇండస్ట్రీలో చక్రం తిప్పటం కష్టం కదా. ఈ విషయంపై రానా కూడా ఎక్కడా స్పందించలేదు. బయట ఎక్కువగా కనిపించని అభిరాం ఈ లీక్స్ తర్వాత పూర్తిగా కనిపించటం మానేసాడు. మరి ఈ ఫొటోస్ వెనుక అసలు స్టోరీ ఏంటో, శ్రీరెడ్డి మాటల్లో వాస్తవమెంత అనే ప్రశ్న మాత్రం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్నంత రీతిలో సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీనికి కంక్లూజన్ ఉందో లేదో వేచి చూడాలి.