శభాష్ సంపూర్ణేష్.. ఛాలెంజ్ అదిరింది‌!

`బి ద రియ‌ల్ మెన్‌` ఛాలెంజ్‌కి అదిరిపోయే కౌంట‌ర్ లాంటి వీడియోని పోస్ట్ చేశాడు సంపూర్ణేష్‌బాబు. బ‌లిసిన వాళ్లంతా తిన్న‌ది అరిగించుకోవ‌డం కోసం అన్న‌ట్టు ఇంటి ప‌ని.. వంటి ప‌ని అంటూ వీడియోలు వ‌దులుతుంటే సెల‌బ్రిటీల‌కు దిమ్మ‌దిరిగే వీడియో ఒక‌టి వ‌దిలాడు సంపూ‌ర్ణేష్‌. సందీప్‌రెడ్డి వంగ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ హంగామా చేస్తోంది.

ద‌ర్‌శ‌కుల నుంచి మొద‌లైన ఈ ఛాలెంజ్ క్ర‌మంగా చిరు కార‌ణంగా పొలిటిక‌ల్ ట‌ర్న్ తీఉకుంటోంది. చిరు కేటీఆర్‌ని నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సీనియ‌ర్ హీరోల్లో చిరుతో పాటు బాల‌య్య‌, నాగార్జున‌, వెంకీల‌ని నామినేట్ చేశాడు. ఇందులో ఇద్ద‌రు చిరు, వెంకీ ప‌ని పూర్తి చేశారు. మిగిలింది బాల‌య్య‌, నాగ్‌. వారి వీడియోల కోసం ఎదురుచూస్తున్న వేళ సంపూ వీడియోని వ‌దిలాడం ఆస‌క్తిక‌రంగా మారింది.

`హృద‌య‌కాలేయం`తో సంపూర్ణేష్‌బాబు అంద‌రినీ ఎట్రాక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఈ వీడియోతో అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశాడు. త‌న‌ని ఈ ఛాలెంజ్‌కి ఎవ‌రూ నామినేట్ చేయ‌క‌పోయినా త‌నే స్వ‌చ్ఛందంగా పాల్గొని ఛాలెంజింగ్ విసిరాడు. వీడియోని పోస్ట్ చేస్తూ సంపూ రాసిన మాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

రాజు పేద తేడా లేదు…
నీ ఆస్తీ , డ‌బ్బు నీ వెన‌క‌రావు…
నువ్వెక్క‌డి నుంచి వ‌చ్చావో మ‌ర్చిపోకు అని నా నిజ‌మైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం నా కంశాలి వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గ‌జ్జెల‌తో త‌న‌కి కాలి మెట్టెలు, పిల్ల‌ల కోసం గ‌జ్జెలు చేసి ఇచ్చాను. అన పోస్ట్ పెట్టాడు. ఈ వీడియోకు ఇప్ప‌టి వ‌ర‌కు 7 వంద‌ల రీ ట్వీట్‌లు, 2.9కె లైకులు వ‌చ్చాయి.

https://twitter.com/sampoornesh/status/1253356374253174784