వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా స‌ర్వైవ‌ల్ అవుతున్నారు. ద‌ర్శ‌కుడిగా చేసిన సినిమాల కంటే వివాదాల వ‌ల్లే వ‌ర్మ అత్య‌ధికంగా పాపుల‌ర్ అయ్యారు. ఈ విష‌యం ప్ర‌తీ ఒక్క‌రికీ విదిత‌మే. ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాల్ని వాడుకుని వివాదాస్ప‌ద చిత్రాల్ని రూపొందించి వార్త‌ల్లోకెక్కి ఎంజాయ్ చేసిన వ‌ర్మ తాజాగా అక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.

క‌రోనా వైర‌స్ దేశాన్ని వ‌ణికిస్తుంటే వ‌ర్మ మాత్రం దాన్నే అడ్డుపెట్టుకుని నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. క‌రోనా పై వ‌రుస ట్వీట్‌లు చేస్తూ హాల్‌చ‌ల్ చేస్తున్న వ‌ర్మ క‌న్న ఇప్పుడు మంచు ల‌క్ష్మిపై ప‌డింది. గ‌తంలో ఆమె కాళ్లని ప‌ట్టుకుని ఓ షార్ట్ ఫిల్మ్‌ని తీసి ర‌చ్చ చేసిన వ‌ర్మ ఈ సారి మంచు ల‌క్ష్మిని అడ్డంగా బుక్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. టిక్ టాక్ లో త‌ల్లీ కూతుళ్లు మంచు ల‌క్ష్మిని పార‌డీ చేస్తూ ఓ వీడియోని రూపొందించారు. ఆ వీడియోని షేర్ చేసిన వ‌ర్మ ఈ వీడియోలో చిన్న పాప అనుకురిస్తున్నది ఎవ‌రినో కొంచెం చెప్పండి? అని అడిగాడు.

దొంద‌ర‌ప‌డిన మంచు మ‌నోజ్ కంట్రోలింగ్ చేసుకోలేక వ‌ర్మ ప్లాన్‌కి బుక్క‌యిపోయాడు. ఆ పాప అనుక‌రిస్తున్నది ఎవ‌రినో రాదు ల‌చ్చ‌క్క‌నే అంటూ చెప్పి బుక్క‌యిపోయాడు. ఒకే వీడియోతో అటు మంచు ల‌క్ష్మిని, ఇటు త‌మ్ముడు మనోజ్‌ని వ‌ర్మ బుక్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.