`వ‌కీల్ సాబ్‌` టీజ‌ర్ వ‌చ్చేస్తోంది!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్ సాబ్`. రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంపైభారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్‌కి సోష‌ల్ మీడియా మోతెక్కిపోయింది. ఇదే ఇందుకు నిదర్శ‌నం. ప‌వ‌న్ నుంచి సినిమా వ‌స్తోందంటే ఫ్యాన్స్‌లో పూన‌కాలు మొద‌ల‌య్యాయి. ఈ అంచ‌నాల‌కు అనుగునంగానే సినిమా ప్ర‌మోష‌న్స్‌ని కూడా దిల్ రాజు, బోనీ క‌పూర్ ప‌క్కా ప్లాన్‌తో మొద‌లుపెట్టేశారు.

ఇటీవ‌ల ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేసి త‌మ స్ట్రాట‌జీ ఏంటో చెప్పేసిన మేక‌ర్స్ ఆదివారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్‌ని బ‌య‌టికి వ‌దిలారు. దీంతో సినిమా ఉద్దేశం ఏంటో? మ‌ఉఖ్యంగా ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారో చెప్పేశారు. గ‌త కొంత కాలంగా టీవీల‌కు అతుక్కుపోయి థీయేట‌ర్ల‌కు రాని మ‌హిళా ప్రేక్ష‌కులు ఈ పాట‌కు ఫిదా అయి రేపు థీయేట‌ర్ల‌కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో అప్‌డేట్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సినిమాని మేలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స్పీడు పెంచిన మేక‌ర్స్ ఈఉగాది రోజున టీజ‌ర్‌ని వ‌ద‌ల‌బోతున్నారు. పండ‌గ రోజు క‌లిసి రావ‌డంతో టీజ‌ర్ భీభ‌త్సంగా ఇంపాక్ట్ చూపించే అవ‌కాశం వుంద‌ని, అందుకే ఆరోజుని టీజ‌ర్ రిలీజ్‌కు చిత్ర బృందం ఎంచుకుంద‌ని చెబుతున్నారు.