`వ‌కీల్‌సాబ్` మ‌హిళా లోకానికి గ్రేట్ ట్రిబ్యూట్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉమెన్ ఎంప‌ర్‌మెంట్‌ని, మ‌హిళా సాధికార‌త‌ని చాటి చెప్పిన ఈ చిత్రాన్ని తెలుగులో మ‌రింత ప్ర‌భావవంతంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. నేటి స‌మాజంలో మ‌హిళ‌ల‌కు ఇస్తున్న గౌర‌వాన్ని, భ‌ద్ర‌తని క‌ల్పించాల‌ని స‌మాజాన్ని ప్ర‌శ్నించే సందేశంతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఇమేజ్‌ని జోడించి రూపొందిస్తున్నారు.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి `మ‌గువా మ‌గువా లోకానికి తెలుసా నీ విలువా.. అంటూ రామ‌జోగ‌య్య‌శాస్త్రి క‌లం నుంచి జాలువారిన ప‌ద‌రేణువుల లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం ఆదివారం విడుద‌ల చేసింది. ఆ పాట‌లోని ప‌దాలు.. లిరిక‌ల్ వీడియోని ఎంత వ‌ర్ణించినా అమ్మ గొప్ప‌ద‌నాన్ని వ‌ర్ణించిన‌ట్టేఅవుతుంది. ఆ పాట‌లోని ప‌దాలు, లిరిక‌ల్ వీడియో మీకోసం..

మ‌గువా.. మ‌గువా.. లోకానికి తెలుసా నీ విలువా…
మ‌గువా మ‌గువా నీ స‌హ‌నానికి స‌రిహ‌ద్దులు క‌ల‌వా…
అటు ఇటు అన్నింటా నువ్వే జ‌గ‌మంతా…
ప‌రుగులు తీస్తావు.. ఇంటా బ‌య‌టా ఆ ఆ…
అలుప‌ని ర‌వ్వంతా…. అన‌నే అన‌వంటా.. వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా…
స… గ.మ.ప..మ గ‌.సా….. గ. మ.ప.మా. గ…. గ. మ.ప.మా.గ… గ.మ.ని పా..మ‌గ‌.సా…
మ‌గువా.. మ‌గువా.. లోకానికి తెలుసా నీ విలువా…ఆ..ఆ..
మ‌గువా మ‌గువా నీ స‌హ‌నానికి స‌రిహ‌ద్దులు క‌ల‌వా…
నీ కాటుక క‌నుటూ.. విప్పార‌క‌పోతే…
ఈ భూమికి తెల‌వార‌దుగా….ఆ ఆ ఆ..
నీ గాజుల చేయి క‌ద‌లాడ‌క‌పోతే…
ఏమ‌నుగ‌డ‌కొన‌సాగ‌దుగా….
ప్ర‌తి వ‌రుస‌లోను ప్రేమ‌గా… అల్లుకున్న బంధ‌మా… అంతులేని నీశ్ర‌మా.. అంచ‌నాల‌కందునా….
ఆల‌యాలు కోర‌నీ ఆదిశ‌క్తి రూప‌మా…. నీవులేని జ‌గ‌తిలో..దీపిమే వెలుగునా…
నీద‌గు లాల‌న‌లో.. ప్రియ‌మ‌గు పాల‌న‌లో.. ప్ర‌తిఒక మ‌గ‌వాడు ప‌సివాడేగా….
ఎంద‌రిపెద‌వుల‌లో….యే చిరున‌వ్వున్నా… ఆ సిరిమెరుపుల‌కూ మూలం నువ్వేగా…ఆ ఆ…
స… గ.మ.ప..మ గ‌.సా….. గ. మ.ప.మా. గ…. గ. మ.ప.మా.గ… గ.మ.ని పా..మ‌గ‌.సా…
మ‌గువా.. మ‌గువా.. లోకానికి తెలుసా నీ విలువా…ఆ..ఆ..
మ‌గువా మ‌గువా నీ స‌హ‌నానికి స‌రిహ‌ద్దులు క‌ల‌వా…

#VakeelSaab - Maguva Maguva Lyrical | Pawan Kalyan | Sriram Venu | Sid Sriram | Thaman S