ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ప్రియమణి ఆ తరువాత ఆ క్రేజ్ కొనసాగించలేక పోయింది. ఆ పైన తెరమరుగై గతేడాది పెళ్లి చేసుకుని స్థిరపడింది. అయితే ఏం నేటి తరం డిజిటల్ మాధ్యమాలు నటీమణులకు స్వాగతం చెబుతున్నాయి.
అలా ప్రియమణి అమెజాన్ ప్రైమ్ లో చేసిన ‘ది ఫామిలీ మాన్’ – దీనిలో మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. రహస్యంగా గూఢచర్యం చేసే ఒక సాధారణ మధ్య తరగతి మనిషి కథ ఇది. ఈ వెబ్ సిరీస్ హిట్ అయింది. దాంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు.
పెళ్ళైన హీరోయిన్లకు నటించడానికి తగ్గ మాధ్యమాలు వచ్చాయి. దాంతో మళ్ళీ కెరీర్ కొనసాగించవచ్చు. ఈ హిట్ తో మరిన్ని వెబ్ సిరీస్ అవకాశాలు, సినిమా అవకాశాలు కూడా రావచ్చు అంటోంది ప్రియమణి. నిజమే కదూ