వెంక‌టేష్ కూతురికి…నాగార్జున కొడుకుకి వివాహ‌మా?

ప్ర‌ముఖ నిర్మాత డి.రామానాయుడు, అలాగే ఎవ‌ర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వీళ్ళిద్ద‌రి గురించి టాలీవుడ్‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే వీరి బంధుత్వం గురించి అంద‌రికీ తెలిసిందే. వృత్తి ప‌రంగా వీరిద్ద‌రి మార్గాలు వేర‌యిన‌ప్ప‌టికీ వ్య‌క్తిప‌రంగా వారిద్ద‌రి అభిప్రాయాలు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. ఇద్ద‌రూ కూడా క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో పెట్టింది పేరుగా ఉండేవారు. ఇక నాగేశ్వ‌ర‌రావు కొడుకు నాగార్జున‌ను రామానాయుడు కూతురు ల‌క్ష్మిని పెళ్ళి చేసుకున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ ఎందుకో మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం వ‌ల్ల వారిద్ద‌రూ కూడా విడిపోయారు. కేవ‌లం ఐదేళ్ళ‌లోనే విడిపోయారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. వారిద్ద‌రి ఆలోచ‌నా విధానం వేరుగా ఉండ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింది. ఇక వారిద్ద‌రు విడాకులు తీసుకునే స‌మ‌యానికి ఒక బాబు కూడా ఉన్నారు. అత‌ను ఎవ‌రో కాదు నాగ‌చైత‌న్య అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

వీరిద్ద‌రి వ‌ల్ల టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న వారి ఇరు కుటుంబాల మ‌ధ్య‌ దూరం బాగా పెరిగింది. ఇక నాగ‌చైత‌న్య కూడా తాను మేజ‌ర్ అయ్యేవ‌ర‌కు త‌ల్లి స‌మ‌క్షంలో పెరిగి ఆ త‌ర్వాత తండ్రి నాగార్జున వ‌ద్ద‌కు వ‌చ్చాడు. మేన‌మామ వెంక‌టేష్ అంటే చైతూకు అమిత‌మైన ప్రేమ‌. ఆ తర్వాత నాగార్జున అమ‌ల‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రామానాయుడు, అక్కినేని ఇరు కుటుంబాల మ‌ధ్య నాగ‌చైత‌న్య అనే లింక్ త‌ప్పించి ప‌ర్స‌న‌ల్‌గా మ‌రొక‌టి లేదు. ఇటీవ‌లె జ‌రిగిన నాగ‌చైత‌న్య పెళ్ళికి ల‌క్ష్మీ త‌న భ‌ర్తతో స‌హా క‌లిసి రావ‌డంతో ఈ రెండు కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు మొద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత అఖిల్ ప్రేమాయణం గురించి కూడా అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. త‌ర్వాత మ‌ళ్ళీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వారి పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఆ సమ‌యంలోనే రామానాయుడు కుటుంబం అంతా నాగార్జున‌కు కాస్త అండ‌గా నిలిచి ధైర్యాన్ని చెప్పారు.

ఇక ఇదిలా ఉంటే నాగార్జున త‌న చిన్న‌నాటి స్నేహితుడైన వెంక‌టేష్ కుమార్తె అయిన హ‌యివాణిని త‌న కొడుకు అఖిల్‌కి ఇచ్చి పెళ్ళి చేయ‌మ‌ని అడిగిన‌ట్టు తెలుస్తోంది. దానికి వెంక‌టేష్ కూడా సుముఖంగానే స్పందించిన‌ట్టు స‌మాచారం. ఇదేగ‌నుక జ‌రిగితే వారి త‌ల్లిదండ్రులు ఆశించిన‌ట్లుగా ఇరుకుటుంబాల మ‌ధ్య బంధం తిరిగి బ‌ల‌ప‌డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.