వీడియో: బికినీ బీచ్‌లో బంతాట ఆడేసిన హాటీ

వీడియో: బికినీ బీచ్‌లో బంతాట ఆడేసిన హాటీ

ఖాళీ స‌మ‌యం చిక్కితే సెల‌బ్రిటీల చిద్విలాసం ఏ రేంజులో ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా ఈ క్వారంటైన్ టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంద‌రు ఫామ్ హౌస్ ల‌కు వెళ్లిపోతే మ‌రికొంద‌రు స‌మీపంలోని బికినీ బీచ్ ల‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఇండ్ల‌కే అంకిత‌మై సెల్ఫ్ జిమ్ము.. యోగాతో టైమ్ పాస్ చేస్తుంటే కొంద‌రు మాత్రం దానికి డిఫ‌రెంటుగా ప్లానింగ్ చేసుకోవ‌డం క‌నిపిస్తోంది.

మ‌రికొంద‌రు త్రోబ్యాక్ ఫోటోల్ని.. వీడియోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. ఇదిగో ఆ కోవ‌కే చెందుతుంది ఊర్వ‌శి రౌతేలా షేర్ చేసిన ఈ వీడియో. ఎప్ప‌టిదో కానీ బికినీ బీచ్ లో బంతాట ఆడేస్తోందిలా. మోకాళ్ల‌ వ‌ర‌కూ నీటిలో మునిగిన ఐర్వ‌శి చేతిలోకి తీసుకుని ఓ బంతిని ఎలా ఆడేసిందో మీరే చూడండి. ఊర్వ‌శి అంతే సింపుల్ గా కుర్ర‌కారు గుండెల్ని బంతాడేస్తోంది క‌దూ? అందుకే ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఆడేసేందుకు ఆఫ‌ర్లు వెంట‌ప‌డుతున్నాయిట‌. ఇప్ప‌టికే ఓ స్టార్ హీరో సినిమాలో ఊర్వ‌శికి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని వార్త‌లొచ్చాయి. క‌రోనా లాక్ డౌన్ తొల‌గిపోతే కానీ ఏదీ క్లారిటీ రాదు. బాలీవుడ్ లో గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ.. హేట్ స్టోరి 4 చిత్రాల‌తో టాప్ లేపేసిన ఈ బ్యూటీ జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించింది. బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ వెల‌గాల‌ని క‌ల‌లు కంటోంది. మ‌రి ఆ క‌ల‌లు నిజం అవుతాయా లేదా.. కాస్త వేచి చూడాలి.