వీడియోటాక్‌: విశ్వ‌క్‌సేన్ హిట్టుకొట్టేలా వున్నాడే!

`ఫ‌ల‌క్‌నుమా దాస్‌` చిత్రంతో హంగామా చేసిన విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `హిట్‌`. కొత్త త‌ర‌హా పోలీస్ క‌థ‌తో ఈ చిత్రం రూపొందిన‌ట్టు తెలుస్తోంది. శైలేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రుహానీశ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై నేచుర‌ల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది.

కాప్ స్టోరీల‌కు పూర్తి భిన్నంగా తెర‌కెక్కిన ఈ చిత్రంతో విశ్వ‌క్‌సేన్ సూప‌ర్‌హిట్‌ని త‌న ఖాతాలో వేసుకునేలా క‌నిపిస్తున్నాడు. ఇవ్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా కూపొందిన ఈ సినిమాపై వున్నకాన్ఫిడెన్స్‌తో చిత్ర బృందం ఓ పూర్తి సీన్‌ని రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 4నిమిషాల 38 సెక‌న్ల నిడివిగ‌ల ఈ వీడియో సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సినిమాలో విశ్వ‌క్‌సేన్ విక్ర‌మ్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. సినిమా టేకింగ్ మేకింగ్ చూస్తుంటే క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా గౌత‌మ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రాఘ‌వ‌న్‌` సినిమా గుర్తొస్తోంది.

అంత రియ‌లిస్టిక్‌గా ఈ చిత్రంలోని స‌న్నివేశాలు వున్నాయి. ద‌ర్శ‌కుడు శైలేష్ చాలా గ్రిప్పింగ్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు ఈ వీడితో అర్థ‌మ‌వుతోంది. కొత్త త‌ర‌హా కాప్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న హిట్ తో డ్యామ్ ష్యూర్‌గా విశ్వ‌క్‌సేన్ హిట్టుకొట్టేలానే వున్నాడు. 28న థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్ని అనుకున్న స్థాయిలోనే ఆక‌ట్టుకుంటుందా?. శైలేష్‌పై హీరో నాని పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిజం చేసి న్యూ ఏజ్ సినిమాల ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తుందా? అన్న‌ది తెలియాలంటే ఈ నెల 28 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

HIT Movie Sneak Peek | Vishwak sen | Ruhani Sharma | Nani | Sailesh Kolanu