విష్ణు మంచు హాలీవుడ్ సినిమా హీరోయిన్ ఎవరంటే

తెలుగు హీరో విష్ణు మంచు కి ఇక్కడ అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే ఏంటి డబ్బులుంటే చాలు ఎక్కడైనా సినిమాలు తీయచ్చు అని అంటున్నాడీయన. అందుకు తగ్గట్టే హాలీవుడ్ సినిమా నిర్మించే పనిలో ఉన్నాడు ఈ మాజీ హీరో. ఒక హాలీవుడ్ డైరెక్టర్ తో ఇంగ్లీష్ సినిమా తీసి దానిని తెలుగు లో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు మంచు విష్ణు. ఇంతకీ అందులో హీరోయిన్ ఎవరంటే మన కాజల్ అగర్వాల్. ఆమెను కలిసి స్క్రిప్ట్ వినిపించేసరికి ఆమెకి కూడా నచ్చి సినిమాకి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.