విశ్వ‌క్‌సేన్ ఓ పాగ‌ల్ అంటున్నడైరెక్ట‌ర్‌!

`ఫ‌ల‌క్‌నుమాదాస్‌` సినిమాతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చాడు విశ్వ‌క్‌సేన్‌. ఈ సినిమా స‌మ‌యంలో విజయ్ దేవ‌ర‌కొండ‌పై సంచ‌ల‌న ఆలోప‌ణ‌లు చేసి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా నేచుర‌ల్ స్టార్ నానికి ద‌గ్గ‌రైన విశ్వ‌కసేన్ తాజాగా `హిట్` సినిమాతో సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా వుంటే విశ్వ‌క్‌సేన్‌ని ఓ ద‌ర్శ‌కుడు పాగ‌ల్ అనడం ఆసక్తిక‌రంగా మారింది.

అయితే అది రియ‌ల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. `హిట్‌` సినిమా స‌క్సెస్‌తో మంచి జోష్‌మీదున్న విశ్వ‌క్‌సేన్ వెంట‌నే మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రానికి `పాగ‌ల్‌` అనే టైటిల్‌ని ఇప్ప‌టికే ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. న‌రేష్ కొప్పిల్లి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో క‌లిసి బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 18న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించబోతున్నార‌ట‌.