వరుణ్ తేజ్ బాక్సింగ్ సినిమా ఆగిపోలేదా?

Varun Tej celebrates his milestone

మెగా హీరో వరుణ్ తేజ్ తన వయసుకు తగ్గ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో చాలా ముందుగానే మాస్ సినిమా చేయాలనీ హరీష్ శంకర్ తో ‘వాల్మీకి’ గా మన ముందుకు వస్తున్నాడు. అటు పైన ఏ సినిమా చేస్తాడా అని అనుకుంటుండగా ఒక కొత్త దర్శకుడితో బాక్సింగ్ నేపధ్యంలో సినిమా చేయనున్నాడు. అంతకు ముందరే ఈ సినిమా అనుకున్నా ఇప్పటికి మొదలు కానుంది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా కోసం వరుణ్ మళ్ళీ తన లుక్ ను మార్చుకుని శరీరాన్ని అందుకు తగ్గట్టు మార్చుకోవాల్సి ఉంటుంది. ‘వాల్మీకి’ తరువాత ఈ సినిమానే మొదలు కానుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు.