లుక్ రెడీ.. ఇక యాక్ష‌న్ అనాల్సిందే!

మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి `వెంకీమామ‌` చిత్రంలో న‌టించిన విక్ట‌రీ వెంక‌టేష్ ఈ సినిమా త‌రువాత వెంట‌నే మ‌రో చిత్రానికి రెడీ అయిపోతున్నారు. `వెంకీమామ‌` స‌క్సెస్‌తో మాంచి జోష్ మీదున్న ఆయ‌న త్వ‌ర‌లో త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌` రీమేక్‌లో న‌టించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ధ‌నుష్ హీరోగా వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం కుల వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో రూపొంది త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించింది.

ఇదే చిత్రాన్ని వెంక‌టేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇందులో వెంక‌టేష్ పల్లెటూరికి చెందిన మొర‌టు వ్య‌క్త‌గా క‌నిపించ‌బోతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న ఆహార్యాన్ని మార్చుకున్నారు. గ‌డ్డం పెంచారు.. మీసం మెలేశారు.. టోట‌ల్‌గా ర‌ఫ్ లుక్‌లోకి వ‌చ్చేశారు.

రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. సినిమాలో వెంకీ లుక్‌, హావ‌భావాలు డిఫ‌రెంట్‌గా వుంటాయ‌ట‌. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబుతో క‌లిసి వి క్రియేష‌న్స్ నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.