‘లార్గో వించ్‌’కాపీ …‘సాహో’డైరక్టర్ రెస్పాన్స్

‘లార్గో వించ్‌’ సినిమా చూడలేదు..:సుజీత్

ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘సాహో’ ఆగస్ట్‌ 30న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ కాపీ అని ప్రచారం జరిగింది. అదే సమయంలో లార్గోవించ్ దర్శకుడు సైతం ట్విట్టర్ లో స్పందించారు. తెలుగువాళ్లకు కాపీ కొట్టడం కూడా రాదు అంటూ వ్యంగ్యంగా సెటైర్స్ వేసారు. ఈ విషయాన్ని దర్శకుడు సుజీత్ ముందు పెట్టినప్పుడు ఆయన ఎలా స్పందిచారో చూద్దాం..

సుజీత్ మాట్లాడుతూ.. ఇలా కామెంట్‌ చేసే వాళ్లలో సగం మంది ‘లార్గో వించ్‌’ సినిమా చూసి ఉండరు. చూసే సినిమా కూడా కాదది. నిజం చెప్పాలంటే నేను ఆ సినిమా చూడలేదు. నాన్న చనిపోతే ఎక్కడో బతుకుతున్న హీరో వచ్చి తాను ఆ నాన్నకు కొడుకుని అని నిరూపించుకోవటం లార్గోవించ్ కథ. దానికి సాహో కథకు సంభందం ఉందా… తండ్రి చనిపోయిన కథలన్నీ లార్గోవించ్ కథలేనా…నేను తీసిన రన్ రాజా రన్ సినిమానే కొద్దిగా మార్చి సాహోగా తీసారు.

‘ప్రపంచానికి తెలియకుండా కొడుకుని ఓ తండ్రి దాచిపెట్టడం అనే కాన్సెప్ట్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి’. ఆ సినిమా స్క్రీన్‌ప్లే వేరు. నా సినిమా స్క్రీన్‌ప్లే వేరు. వాళ్లకు నెక్ట్స్‌ సినిమా రిలీజ్‌ వరకూ ఫీడింగ్‌ కావాలి. ప్రస్తుతానికి మేమే ఉన్నాం. ఈ కాంట్రవర్శీ ఇంకా జనాల్లో ఉండాలి. అందుకే రాస్తుంటారు. ఓ పెద్ద హిట్‌ సినిమా నుంచి ప్రేరణ పొందాం అని చెప్పినా సంతోషపడొచ్చు అని తేల్చి చెప్పారు.