రొమాంటిక్‌ లుక్‌: ఇద్ద‌రూ రెచ్చిపోయారుగా!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వార‌సుడు ఆకాష్ పూరి హీరోగా ల‌క్ చెక్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తొలి ప్ర‌య‌త్నం `మెహ‌బూబా` బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అవ్వ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. సినిమా సక్సెస్ అవ్వ‌క‌పోయినా ఆకాష్ డాషింగ్ పెర్ఫామెన్స్ కి ఈజ్ కి మంచి పేరొచ్చింది. ఆ క్ర‌మంలోనే పూరి ఎంతో ఆచితూచి ఈసారి మ‌రో రొమాంటిక్ యూత్ ఫుల్ ల‌వ్ స్టోరిని ఆకాష్ కోసం ఎంపిక చేశారు. ఆకాష్ న‌టిస్తున్న ఈ రెండో చిత్రానికి `రొమాంటిక్` అనే టైటిల్ ని నిర్ణ‌యించారు.

ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రెట్టించిన ఉత్సాహంతో పూరి – ఛార్మి బృందం ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. పూరి శిష్యుడు అనీల్ పాడూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆకాష్ కి ఎట్టి ప‌రిస్థితిలో ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌న్న పంతం రొమాంటిక్ టీమ్ లో క‌నిపిస్తోంది. మెహ‌బూబాతో పోగొట్టుకున్న‌ది రొమాంటిక్ తో తిరిగి రాబ‌ట్టాల‌న్న క‌సి క‌నిపిస్తోంది. ఓవ‌ర్ కేర్ వ‌ల్ల‌నో ఏమో.. రొమాంటిక్ చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే పూరి ఫ్యాన్స్ మ‌ర్చిపోకుండా అప్ప‌డ‌ప్పుడు ఓ ఘాటైన పోస్ట‌ర్ ని రిలీజ్ చేసి రొమాంటిక్ ని లైమ్ లైట్ లో ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌కుముందు బీచ్ ఇసుక‌లో కేతిక శ‌ర్మ‌తో ఆకాష్ ఘాటైన‌ రొమాన్స్ చేస్తున్న పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసారు. ఆ లుక్ కి అద్భుత స్పందన వ‌చ్చింది. తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ని పూరి టీమ్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆకాష్ – కేతిక జంట డీప్ కిస్ హాట్ టాపిక్ గా మారింది. ఓ ర‌న్నింగ్ బ‌స్ ఎంట్రాన్స్ ఫుట్ బోర్డ్ లో కేతిక‌ను హీరో ఆకాష్ ఘాడంగా లిప్ లాక్ వేశాడు. టీనేజ‌ర్స్ ని.. కాలేజ్ స్టూడెంట్స్ ని టెంప్ట్ చేసే పోస్ట‌ర్ ఇది. ఇక కేతిక తొలి నుంచి అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌క ఘాటైన స‌న్నివేశాల్లో జీవించేస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్టు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ రెడ్ బ‌స్ లో ఫుట్ బోర్డ్ జ‌ర్నీ రెగ్యుల‌ర్ గా చూసేదే. ఆ లిప్ లాక్ కి స్ఫూర్తి బ‌హుశా అదే కావొచ్చు. రొమాంటిక్.. ప‌క్కా కాలేజ్ ల‌వ్ స్టోరి అని ఈ పోస్ట‌ర్ చూశాక గెస్ చేయొచ్చు. మే 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆకాష్ రెండో ప్ర‌య‌త్నం బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఏమేర‌కు స‌ఫ‌ల‌మ‌వుతుందో చూడాలి.