రెడ్ డిసెర్ట్‌లో వెంకీ యాక్ష‌న్ మోడ్‌!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `నార‌ప్ప‌`. శ్రీ‌కాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌` ఆధారంగా రీమేక్ చేస్తున్నారు. త‌మిళ మాతృకని నిర్మించిన‌ ప్రొడ్యూస‌ర్ క‌లైపులి ఎస్‌.థాను ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ వ‌య‌సుమ‌ళ్లిన వ్య‌క్తిగా, యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. ప్రియ‌మ‌ణిని హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసుకున్నారు.

గ‌త కొన్ని రోజులుగా చెన్నైలో షూటింగ్ జ‌రుగుతోంది. తాజాగా ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్ నేతృత్వంలో వెంక‌టేష్‌, ఫైట‌ర్స్ పాల్గొన‌గా కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్నారు. త‌మిళనాడు లోని తెరికాడ్ రెడ్ డెసెర్ట్‌లో గ‌త 10 రోజుల పాటు యాక్ష‌న్ సీన్‌ల‌ని షూట్ చేశారు. ఈ స‌న్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు 27 రోజుల పాటు షూటింగ్ జరిగింది. కంటిన్యూగా షూటింగ్ చేసి చిత్రాన్ని స‌మ్మ‌ర్‌కి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.