నితిన్‌కి ఇక అంతా శుభమే అన్నట్టుగా సంకేతాలు మొదలయ్యాయి. ఈ నెల 15న షాలినితో ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్‌కి శుభ వార్తలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో వున్న నితిన్ తాజాగా `భీష్మ`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆర్గానిక్ ఫామింగ్ నేపథ్యంలో అండర్ కరెంట్‌గా రైతు సమస్యల్ని ఎంటర్టైన్మెంట్ని జోడించి వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సటీలో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన వెంకీ కుడుముల తన రెండవ చిత్రానికే ఆర్గానిక్ ఫామింగ్ థీమ్‌ని తీసుకోవడం విశేషం. సరికొత్త నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే 8 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ప్రాఫిట్‌ని అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
`భీష్మ` చిత్రాన్ని 23 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. 32 కోట్లు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. నితిన్ కెరీర్లోనే రిలీజ్‌కు ముందు 9 కోట్ల లాభాన్ని అందించిన సినిమా `భీష్మ` కావడం విశేషమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెంకీ కుడుముల టేకింగ్, రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయిని తెలుస్తోంది.