`సైరా` కు పన్ను మినహాయించరా?
ఆందోళనలు, కోర్టులు, కేసులూ దాటి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ `సైరా నరసింహారెడ్డి` ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. అయితే `సైరా నరసింహారెడ్డి` చిత్రానికి ట్యాక్స్ మినహాయింపు ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు. కానీ పవన్ రాజకీయాల్లో ఉండటం, మెగాస్టార్ పై కక్షతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వటం లేదంటున్నారు. ఇంతకు ముందు నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్పట్లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. చరిత్ర నేపథ్యంలో ఏ సినిమా తెరకెక్కినా కొంతమేర మినహాయింపు ఉంటూ వస్తోంది. కానీ తెలుగు వీరుడైన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవితానికి మాత్రం ట్యాక్స్ మినహాయింపు లేదని వాపోతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చరిత్రలో ఉన్న వాళ్లు కావడంతో అప్పట్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా రిలీజ్ కు ముందే ట్యాక్స్ మనిహాయింపును ఇచ్చాయి.
అయితే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి …బయోపిక్ కాదని, కల్పన అనిచెప్పటంతో ఈ సినిమాకు పన్ను ఇవ్వటానికి ప్రభుత్వాలు నిరాకరించాయని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ప్రభుత్వాలను ట్యాక్స్ మినహాయింపు కోరగా విముఖతను వ్యక్తం చేసాయని తెలిసింది. భారీ బడ్జెట్ తో సాహసం చేసిన నిర్మాత రామ్ చరణ్ రిక్వెస్ట్ ని ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు.