రాజ‌మౌళి ఎవ‌రిని బుక్ చేస్తాడో?

రాజ‌మౌళి ఎవ‌రిని బుక్ చేస్తాడో?

ఈ రోజు (సోమ‌వారం) ద‌ర్శ‌‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎవ‌రిని బుక్ చేయ‌బోతున్నాడు?… ఇంత‌కీ ఆయ‌న ఏం చేయ‌బోతున్నాడూ? వివ‌రాల్లోకి వెళ్లితే.. తెలుగులో `అర్జున్‌రెడ్డి` సినిమాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని ఓ గేమ్ ఛేంజ‌ర్‌గా మారిన ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ‌. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో `క‌బీర్‌సింగ్‌` ప‌రుతో షాహీద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేసి అక్క‌డ కూడా సంచ‌ల‌నం సృష్టించాడు. తాజాగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైపోయారు సందీప్ వంగ‌.

అయితే ఆదివారం ఇంటి ప‌ని చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన సందీప్ వంగ `మగ‌వారు ఇంటి పనులు చ‌క్క‌గా చేస్తారు. నిజ‌మైన పురుషుడు ఈ క్వారెంటైన్ టైమ్‌లో ప‌నిమ‌నుషులు రాన‌ప్పుడు ఇంట్లో మ‌హిళ‌తో ప‌ని చేయించ‌డు. బీ ద రియ‌ల్‌మెన్‌. అంటూ ఓ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సందీప్ వంగ‌ ఇలాంటి వీడియోని రాజ‌మౌళిగారిని కూడా చేయాల్సిందిగా ఛాలెంజ్ చేశాడు.

`ఈ ఛాలెంజ్‌ని అంగీక‌రిస్తున్నా సందీప్` అంటూ రాజ‌మౌళి రిప్లై ఇవ్వ‌డంతో సోమ‌వారం జ‌క్క‌న్న ఎలాంటి వీడియోని వ‌దులుతాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జ‌క్క‌న్న ఎలాంటి వీడియోని చేస్తాడు. ఈ ఛాలెంజ్ కోసం ఎవ‌రిని బుక్ చేయ‌బోతున్నాడు? ప‌్ర‌భాస్‌నా, లేక ఎన్టీఆర్‌నా, లేక రామ్‌చ‌ర‌ణ్‌నా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.