బాలీవుడ్ భామ అలియాభట్ రాజమౌళికి షాకిచ్చినట్టేనా?. యావత్ దేశం ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత క్రేజీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ చివరి దశకు చేరుకుంది.
హీరోయిన్ అలియాభట్ ఎంట్రీ మినహా దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేశారు. అలియా కోసమే వేయిటింగ్. ఇంతలో కరోనా వైరస్ విళయతాండవం చేస్తుండటంతో పూనే షూటింగ్‌ని ఆపేశారు. ఈ షెడ్యూల్‌లోనూ అలియా ఎంటర్ కావాలి. కానీ కాలేదు. ఆమె కోసమే ఎదురుచూస్తున్నామని ఒక సందర్భంలో రాజమౌళి వెల్లడించాడు కూడా. అయితే తాజాగా రాజమౌళికి అలియాభట్ షాక్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనకుండానే అలియాభట్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తాజాగా విశ్వసనీయ సమాచారం ఒకటి బయటికి వచ్చింది.
అలియాభట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో `గంగూభాయ్`, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి `బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో నటిస్తోంది. ఆ సినిమాలు పూర్తి కాకుండా రాజమౌళికి అలియా డేట్స్ కేటాయించడం కష్టంగా మారింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్ ` చిత్రం నుంచి తప్పుకోవాలని అలియా నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ టాక్. అదే నిజమైతే రాజమౌళి మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టక తప్పదు.