రాక్ష‌సుడితో పెళ్లికి రెడీ అయిపోతోంది!

త‌మిళ చిత్రం `రాక్ష‌స‌న్‌`తో సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకున్నాడు హీరో విష్ణు విశాల్‌. గ‌త కొన్ని నెల‌ల క్రితం త‌న భార్య‌తో విడిపోయిన విష్ణు విశాల్‌ హైద‌రాబాద్ బ్యాండ్మంట‌న్ స్టార్ గుత్తా జ్వాల‌తో స‌న్నిహితంగా వుంటున్నాడు. బ‌ర్త్‌డే పార్టీలు, ప్యూ ఇయ‌ర్ పార్టీలు, ముద్దులు… ఆ ఫొటోల్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌డంతో గ‌త కొన్ని నెల‌లుగా గుత్తా జ్వాల‌, విష్ణు విశాల్ హాట్ టాపిక్‌గా మారిపోయారు.

బ్యాడ్మింట‌న్ గేమ్‌కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తీసుకొచ్చిన గుత్తా జ్వాల తాజా సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. గ‌త కొంత కాలంగా విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో వున్నాన‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్నామ‌ని పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. గుత్తా జ్వాల‌, విష్ణు విశాల్‌ల ప్రేమాయణం మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గానే మిగులుతుంద‌ని భావించిన వారంతా గుత్తాజ్వాల పోస్ట్ చూసి అవాక్క‌వుతున్నార‌ట‌.