రవి తేజ సరసన అదితి రావు, RX 100 దర్శకుడి సినిమా

RX100 సినిమాను అప్పుడే ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమా బృందం మొత్తానికీ ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. సరే, ఈ సినిమా హీరో, హీరోయిన్ ఇప్పటికే పలు సినిమాలు చేస్తున్నా ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇంత వరకు కనిపించలేదు. తాజాగా మాస్ మహారాజా రవితేజ తో సినిమా ఖరారు చేసుకున్నాడు.
ఈ సినిమాకి ‘మహా సముద్రం’ అనే టైటిల్ పెట్టారు. రవి తేజ తన ప్రస్తుత చిత్రం డిస్కో రాజా షూటింగ్ పూర్తి చేసి, అజయ్ సినిమా మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘సమ్మోహనం’ ఫేమ్ అదితి రావును తీసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే సినిమాకి సంతకం చేసేసిందట అదితి. త్వరలోనే షూటింగ్ మొదలు కావచ్చు.