రవితేజ “డ్రీమ్ హీరోయిన్” ఎవరు ?

రవితేజ “డ్రీమ్ హీరోయిన్” ఎవరు ?

టాలీవుడ్ లో ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్నదర్శకుడు అజయ్‌ భూపతి తాజా చిత్రం ‘మహా సముద్రం’. మాస్‌ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రంపై అప్పుడు అంచనాలు ఎక్కువవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమేనంటున్నారు చిత్ర ప్రముఖులు.

అయితే ఈ చిత్రంలో రవితేజ సరసన నటించే భామల విషయంలో ఎప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఓసారి అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తే, మరో సారి కథానాయిక రకుల్ పేరు వార్తల్లోకి వచ్చింది. తాజాగా రాశీఖన్నా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాశీ గతంలో రవితేజ సరసన బెంగాల్‌ టైగర్, టచ్‌ చేసి చూడు చిత్రాల్లో నటించారు. డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజను ఈ చిత్రంలో నటించే కథానాయికలెవరు? అని అడిగితే.. ఎంతో తెలివిగా ‘నాకు మాత్రం ఆమెతోనే చేయాలనుంది. కానీ ఆమె ఎవరో మీకు చెప్పను. ఒకవేళ మీకు తెలిస్తే నాకూ చెప్పండి’ అంటూ తనదైన స్టయిల్లో ఎదురు ప్రశ్న వేసి జారుకున్నాడట!