‘రచ్చ’ దర్శకుడితో కళ్యాణ్ రామ్

118 సినిమా తరువాత కళ్యాణ్ రామ్ కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. ఆచి తూచి దర్శకులను కధలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే సతీష్ వేగేశ్న తో ‘తుగ్లక్’ చేస్తున్నాడు. అలాగే శతమానం భవతి సినిమా దర్శకుడితో ఒక కుటుంబ కదా చిత్రం చేస్తున్నాడు. తాజాగా ‘రచ్చ’ సినిమా దర్శకుడు సంపత్ నంది కళ్యణ్ రామ్ కు ఒక కధ చెప్పాడు. కధ నచ్చిన కళ్యాణ్ రామ్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ మధ్య కాస్త సక్సెస్ రేట్ తగ్గిన సంపత్ ఎలాగైనా ఈ సినిమా తో విజయం సాధించాలని కసరత్తులు చేస్తున్నాడట.