యంగ్ హీరో రొమాన్స్ లో నిండా మునిగాడ‌ట‌!

అఖిల్ న‌టిస్తున్న నాలుగో చిత్రం శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నాయిక‌. `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. చివ‌రి షెడ్యూల్ లో ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు అఖిల్- పూజా మధ్య లవ్ సీన్స్ ను షూట్ చేశారు. లవ్ సీన్స్ లో ఈ జంట మధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరిందని.. ఆ ఇరువురి న‌డుమ‌ లవ్ సీన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

అఖిల్ గ‌త చిత్రం `మిస్టర్ మజ్ను` వ‌రుస‌గా మూడో ఫెయిల్యూర్. అందుకే నాలుగో చిత్రంపై బోలెడ‌న్ని హోప్స్ ఉన్నాయి. `బొమ్మరిల్లు` భాస్కర్ తో చేస్తోన్న సినిమాకి కూడా అఖిల్ దగ్గర ఉండి సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు.